RS Praveen Kumar: జీతాలు ఇవ్వలేక కేసీఆర్ ప్రభుత్వం చతికిల పడటం దేనికి సంకేతం?: ప్రవీణ్ కుమార్

KCR govt didnt give salaries to employees says RS Praveen Kumar

  • 12వ తేదీ వచ్చినా సగం జిల్లాల్లో జీతాలు పడలేదన్న ప్రవీణ్ 
  • ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది ఎవరని ప్రశ్న 
  • ఈ దోపిడీ దొంగలను ఏం చేద్దామన్న ప్రవీణ్ కుమార్  

12వ తేదీ వచ్చినప్పటికీ తెలంగాణలో ఇంకా చాలా జిల్లాల్లో ప్రభుత్వోద్యోగులకు జీతాలు పడలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఇదే అంశంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ... ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 

12వ తేదీ వచ్చినప్పటికీ సగం జిల్లాలలో ఉద్యోగులకు జీతాలను ఇవ్వలేక కేసీఆర్ ప్రభుత్వం చతికిలపడటం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం అయిన మన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చింది ఎవరని ప్రశ్నించారు. మన డబ్బులు ఎవరి వాస్తులకు, దోస్తులకు, దావత్ లకు ఖర్చు చేశారని అడిగారు. ఈ దోపిడీ దొంగలను ఏం చేద్దామని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. దీనికి తోడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని షేర్ చేశారు. 

  • Loading...

More Telugu News