Gotabaya Rajapaksa: భారత్ సాయంతో రాజపక్స పారిపోయాడంటూ ప్రచారం.. ఖండించిన ఇండియా!

India denies news of India helping Rajapaksa flee to Maldives

  • భార్య, ఇద్దరు బాడీ గార్డ్స్ తో మాల్దీవులకు వెళ్లిపోయిన రాజపక్స
  • ఎయిర్ ఫోర్స్ విమానంలో పరారైన అధ్యక్షుడు
  • ఆయన వెళ్లిపోయినట్టు ప్రకటించిన ప్రధాని కార్యాలయం

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని శ్రీలంక ప్రధాని కార్యాలయం కూడా ధ్రువీకరించింది. భార్య, ఇద్దరు బాడీ గార్డ్స్ తో కలిసి ఎయిర్ ఫోర్స్ విమానంలో ఆయన పరారయ్యారు. 

శ్రీలంక సైన్యానికి అధిపతి కూడా అయిన దేశాధ్యక్షుడికి ఉన్న కార్యనిర్వాహక అధికారాల ప్రకారమే ఆయన తరలింపు జరిగిందని ఆ దేశ వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. మాల్దీవుల్లోని వెలనా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన ల్యాండ్ అయ్యారు.

 మరోవైపు, రాజపక్స స్వదేశం నుంచి పారిపోవడానికి భారత్ సాయం చేసిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని శ్రీలంకలోని భారత హైకమిషన్ ఖండించింది. ఈ ప్రచారం నిరాధారమైనదని తెలిపింది. రాజపక్స శ్రీలంక విడిచి వెళ్లిపోయే ప్రయాణాన్ని భారత్ సులభతరం చేసిందనే ప్రచారంలో నిజం లేదని చెప్పింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News