National Emblem: పార్లమెంటులో ప్రతిష్ఠించిన భారీ జాతీయ చిహ్నంపై విమర్శలు.. తయారీదారుల స్పందన ఇదే!
- 2.5 అడుగుల ఒరిజినల్ శిల్పాన్ని తాము ఎన్నో రెట్లు పెద్దదిగా చేశామని వివరణ
- ఈ చిహ్నాన్ని కనీసం 100 మీటర్ల దూరం నుంచి చూడాల్సి ఉంటుందని సలహా
- ఒరిజినల్ శిల్పంలోని డ్యామేజీలు కూడా తేడాలకు కారణం కావచ్చని వ్యాఖ్య
కొత్త పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నంపై రాజకీయ దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. సారనాథ్ లోని అశోక స్తూపంపై ఉన్న సింహాలకు, వీటికి ఎంతో తేడా ఉందని విమర్శిస్తున్నాయి. ఎంతో హుందాగా, శాంతిని ప్రబోధిస్తున్నట్టు ఉండే నాలుగు సింహాలు... ఈ శిల్పంలో చాలా క్రూరంగా, దౌర్జన్యకరంగా కనిపిస్తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తక్షణమే వాటిని మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి.
మ్యూజియంకు వెళ్లి అక్కడ ఉన్న శిల్పంపై తాము రీసర్చ్ చేశామని తెలిపారు. 2.5 అడుగుల ఎత్తున్న ఒరిజినల్ శిల్పాన్ని తాము ఎన్నో రెట్లు పెద్దదిగా తయారు చేశామని చెప్పారు. పార్లమెంటు భవనంపై పెట్టిన, తాము తయారు చేసిన జాతీయ చిహ్నాన్ని కనీసం 100 మీటర్ల దూరం నుంచి చూడాల్సి ఉంటుందని చెప్పారు. కాబట్టి అంత దూరం నుంచి చూసినప్పుడు అది సరిగ్గా కనిపించేలా తాము తయారు చేశామని తెలిపారు.