Kerala: దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు.. యూఏఈ నుంచి వచ్చిన కేరళ వ్యక్తికి నిర్ధారణ

One case of monkeypox infection confirmed in Kerala

  • ఈ నెల 12న యూఏఈ నుంచి కేరళ వచ్చిన బాధితుడు
  • మంకీపాక్స్ సోకినట్టు నిర్ధారించిన పూణె ల్యాబ్
  • అప్రమత్తమైన కేంద్రం ముందు జాగ్రత్తలు 
  • కేరళకు అత్యున్నతస్థాయి మల్టీ డిసిప్లినరీ టీం 

దేశంలో మంకీపాక్స్ తొలికేసు నమోదైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి ఇటీవల కేరళకు వచ్చిన వ్యక్తికి ఇది సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. మంకీపాక్స్ మొదటి కేసు నమోదైన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. అత్యున్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ టీంను కేరళకు పంపింది.

ఈ నెల 12న యూఏఈ నుంచి కేరళ చేరుకున్న ప్రయాణికుడిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన అధికారులు అతడిని ఆసుపత్రికి తరలించి అబ్జర్వేషన్‌లో ఉంచారు. అతడి నుంచి శాంపిల్స్ సేకరించి పూణెలోని వైరాలజీ ఇనిస్టిట్యూట్‌కు పంపగా, నిన్న సాయంత్రం ఫలితాల నివేదిక వచ్చింది. అందులో అతడికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

  • Loading...

More Telugu News