Khammam District: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఏసీ మిరపకు రికార్డు ధర.. క్వింటాలుకు రూ. 22,800

AC Type Mirchi quintal rate above Rs22 thousand in Khammam Market

  • మార్కెట్ చరిత్రలోనే తొలిసారి అత్యధిక ధర
  • ఈ నెల 1న క్వింటాలుకు రూ. 22 వేలు పలికిన ధర
  • ఏసీ రకం మిర్చిని పండించిన అల్లిపురం రైతు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నిన్న ఏసీ మిరపకు రికార్డు ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే తొలిసారి క్వింటాలుకు ఏకంగా రూ. 22,800 చొప్పున పలకడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అల్లిపురానికి చెందిన రావూరి సత్యనారాయణ అనే రైతు ఏసీ రకం మిర్చి పండించాడు. మార్కెట్‌కు ఆయన తీసుకొచ్చిన 22 బస్తాల మిర్చిని క్వింటాలుకు రూ. 22,800 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. 

మార్కెట్‌కు మొత్తం 5,546 బస్తాల ఏసీ మిరప బస్తాలు రాగా, ఎండు మిరప 2,058 బస్తాలు, తాలు మిరప 265 బస్తాల సరుకు వచ్చినట్టు మార్కెట్ అధికారులు తెలిపారు. కాగా, తేజ రకం మిర్చికి అత్యధిక ధర పలుకుతుండడంతో శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన సరుకును కూడా తెచ్చి విక్రయిస్తున్నారు. కాగా, ఈ నెల 1న ఏసీ మిరప క్వింటాలుకు రూ.22 వేలు పలకింది. కాగా, మార్కెట్లో నిన్న మిరప కనిష్ఠ ధర రూ. 17,600గా ఉండగా, నమూనా ధర రూ. 20 వేలు పలికింది.

  • Loading...

More Telugu News