banks: తక్కువ వడ్డీపై వ్యక్తిగత రుణాలిస్తున్న బ్యాంకులు ఇవే..!

banks offering lowest personal loan interest rates

  • అత్యవసర పరిస్థితుల్లో రుణ మార్గాల్లో ఇదీ ఒకటి
  • ఎక్కువ బ్యాంకుల్లో రూపాయి వరకు వడ్డీ రేటు
  • ప్రభుత్వరంగ బ్యాంకుల్లో తక్కువ రేట్లు

వ్యక్తిగత రుణాలు అన్నవి అత్యవసర పరిస్థితుల్లో నిధులు సమకూర్చుకునే మార్గాల్లో ఒకటి. వేతన జీవుల్లో సగానికి పైనే వ్యక్తిగత రుణాలు తీసుకుంటున్నట్టు ఆ మధ్య ఓ సర్వేలో వెల్లడైంది. ఆదాయ మార్గం ఉండి, మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి ఇవి వేగంగా లభిస్తాయి. బ్యాంకులు తమ ఖాతాదారులు, శాఖ వరకు రాకుండానే డిజిటల్ రూపంలోనే వీటిని ఆఫర్ చేస్తున్నాయి.

వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు కొన్ని బ్యాంకుల్లో తక్కువగాను, కొన్ని బ్యాంకుల్లో ఎక్కువగానూ ఉంటుంటాయి. దీనికి కారణం ఇవి అన్ సెక్యూర్డ్ రుణాలు. అంటే రుణం తీసుకున్న వ్యక్తి చెల్లించకపోతే, బ్యాంకు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. వసూలు అయ్యే వరకు అది నిరర్థక రుణ ఆస్తిగానే ఉంటుంది. అందుకని బ్యాంకులు ఎటువంటి తనఖా, హామీ లేని వ్యక్తిగత రుణాలపై కొంచెం అధిక వడ్డీ రేటును వసూలు చేస్తుంటాయి. 

అదే గృహ రుణం, బంగారంపై రుణం, ప్రాపర్టీపై రుణం వంటి సెక్యూర్డ్ (ఆస్తులు హామీగా ఉంచుకోవడం) రుణాలపై తక్కువ వడ్డీ రేటు వసూలు చేస్తుంటాయి. ఇక వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు అన్నది రుణ గ్రహీతల క్రెడిట్ స్కోరు ఆధారంగా మారుతుంది. 800 కు పైన స్కోరు ఉన్న వారికి ఒక రకంగా, 750-800 మధ్య ఉన్న వారికి ఒక రకంగా, 750కు దిగువన ఉన్న వారికి అధిక రేటును బ్యాంకులు సాధారణంగా చార్జ్ చేస్తుంటాయి.

వివిధ బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాల రేట్లు
బ్యాంకు 
వడ్డీరేటు (శాతంలో) కాల వ్యవధి 
ఐడీబీఐ బ్యాంకు 8.90-14 
12-60 నెలలు 
పీఎన్ బీ 
9.35-15.35 60 నెలలు 
ఇండియన్ బ్యాంకు 
9.40-9.90 
12-36 నెలలు 
కరూర్ వైశ్యా బ్యాంకు 
9.40-19 12-60 నెలలు 
ఎస్ బీఐ 9.80-12.80 6-72 నెలలు 
సెంట్రల్ బ్యాంకు 
9.85-10.05 
48 నెలలు 
యూనియన్ బ్యాంకు 
10.20-12.40 
60 నెలలు 

  • Loading...

More Telugu News