Justice Lalit: పిల్లలు 7 గంటలకే స్కూలుకు వెళుతున్నప్పుడు.. కోర్టు 9 గంటలకు ఎందుకు మొదలు కాకూడదు?: సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ లలిత్
- 9.30 గంటలకే విచారణలు మొదలు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం
- సాధారణంగా అయితే 10.30 గంటలకు మొదలు
- కొత్త సంప్రదాయానికి తెరదీసిన జస్టిస్ లలిత్
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ ఓ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా సుప్రీంకోర్టులో ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. మధ్యలో 1-2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న ఈ సమయ పాలనకు భిన్నంగా జస్టిస్ లలిత్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విచారణలు మొదలు పెట్టింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ సుదాన్షు ధూలియా కూడా ఉన్నారు.