- 11 జిల్లాల్లో 65 కేసుల గుర్తింపు
- ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలోనే ఎక్కువ
- ప్రైవేటులోనూ ఉచిత చికిత్సకు ప్రభుత్వం నిర్ణయం
పశ్చిమబెంగాల్ ప్రజలు ఇప్పుడు బ్లాక్ ఫీవర్ జ్వరంతో వణికిపోతున్నారు. రాష్ట్రంలోని 11 జిల్లాలలో మొత్తం 65 బ్లాక్ ఫీవర్ (కాలా అజార్) కేసులు ఇప్పటికి వెలుగు చూశాయి. ప్రధానంగా డార్జిలింగ్, మాల్డా, ఉత్తర్ దినాజ్ పూర్, దక్షిణ్ దినాజ్ పూర్, కలింపోంగ్ జిల్లాల్లో ఎక్కువ కేసులు వచ్చాయి.
‘‘కాలా అజార్ ను వాస్తవంగా అయితే పశ్చిమబెంగాల్ లో నిర్మూలించేశాము. కానీ, ఇటీవల నిఘా పెట్టడంతో 11 జిల్లాల పరిధిలో 65 కేసులు వచ్చాయి. ఈ వ్యాధిని ప్రభుత్వం కట్డడి చేయగలదు. ఎక్కువ రోజుల పాటు బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లో ఉండి వచ్చిన వారిలోనే జ్వరం బయటపడుతోంది. అదే సమయంలో బంగ్లాదేశ్ కు చెందిన కొందరు వ్యక్తుల్లోనూ ఈ లక్షణాలు ఉన్నాయి’’ అని ఓ అధికారి తెలిపారు.
తాజా పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది. కాలా అజార్ తో ఎవరు ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినా తాము పూర్తిగా భరిస్తామని రాష్ట్ర యంత్రాంగం స్పష్టం చేసింది.