Somu Veerraju: వైసీపీకి కొత్త అర్థం చెప్పిన సోము వీర్రాజు

Somu Veerraju gives new definition to Somu Veerraju
  • జులై 15 సాయంత్రానికల్లా రోడ్లు రెడీ అయిపోతాయని సీఎం చెప్పారన్న వీర్రాజు
  • జులై 20న ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేస్తామన్నారని వ్యాఖ్య
  • సీఎం గారూ, మీరు చెప్పిన మాట గుర్తుందా? అంటూ ఎద్దేవా
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల అధ్వాన పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్ పై ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. జులై 15 సాయంత్రానికల్లా రోడ్లు మొత్తం రెడీ అయిపోతాయని, జులై 20న ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేసి ప్రజలకు చూపిస్తామని జగన్ చెప్పారని ఆయన అన్నారు. జగన్ గారూ మీరు చెప్పిన ఈ మాట మీకు గుర్తుందా? అని ప్రశ్నించారు. 

ఒకవేళ గుర్తుంటే.. మాట తప్పం, మడమ తిప్పం అనే మీ నినాదం ఏమైనట్టు? అని అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల్లా మారిన రోడ్ల పరిస్థితిపై మీ సమాధానం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. YCP అంటే వైఫల్యం చెందిన పార్టీ అని కొత్త అర్థం చెప్పారు.
Somu Veerraju
BJP
Jagan
YSRCP
Roads

More Telugu News