Rape Case: జైలు సిబ్బందితో సరదాగా కాలక్షేపం చేస్తున్న అత్యాచారం కేసు నిందితుడు, మాజీ సీఐ నాగేశ్వరరావు.. కేసు నుంచి ఈజీగా బయటపడతానని ధీమా!

rape case accused nageswara rao says he would easily escape from this case
  • తన వద్ద పనిచేస్తున్న వ్యక్తి భార్యపై అత్యాచారం ఆరోపణల్లో నాగేశ్వరరావు అరెస్ట్
  • జైలు సిబ్బంది, తోటీ ఖైదీలతో హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటున్న వైనం
  • కనిపించని పశ్చాత్తాపం
  • కస్టడీకి అనుమతించిన కోర్టు.. అయినా తీసుకోలేదన్న ఆరోపణలు
  • అదేం లేదంటున్న పోలీసులు
తన ఫాంహౌస్‌లో పనిచేస్తున్న వ్యక్తి భార్యపై అత్యాచారం కేసులో అరెస్ట్ అ‌యిన మాజీ సీఐ నాగేశ్వరరావు చర్లపల్లి జైలులో సరదాగా కాలక్షేపం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఆయన.. తోటి ఖైదీలు, జైలు సిబ్బందితో కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఉన్నట్టు సమాచారం. తప్పు చేశానన్న పశ్చాత్తాపం ఆయనలో ఏమాత్రం కనిపించడం లేదని, ఈ కేసును ఈజీగా బయటపడతానని తోటి ఖైదీల వద్ద ఆయన ధీమా వ్యక్తం చేసినట్టు తెలిసింది. 

మరోవైపు, ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నాగేశ్వరరావు కస్టడీ కోరుతూ వనస్థలిపురం పోలీసులు గురువారం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, శుక్రవారం అనుమతి లభించినట్టు సమాచారం. పోలీసు కస్టడీకి సంబంధించి జైలులో ఉన్న నాగేశ్వరరావుకు కూడా నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. అయితే, పోలీసులు మాత్రం నాగేశ్వరరావు కస్టడీపై సోమవారం విచారణ జరుగుతుందని చెబుతున్నారు. కస్టడీ అనంతరం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తామని తెలిపారు. దీంతో కోర్టు అనుమతి ఇచ్చినా నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, పోలీసులు వీటిని ఖండించారు.
Rape Case
CI Nageswara Rao
Cherlapally Jail
Hyderabad

More Telugu News