gotabaya Rajapaksa: సింగపూర్ నుంచి వెళ్లిపోవాలంటూ శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్సకు అల్టిమేటం!

Rajapaksa Told to Leave Singapore After 15 Days India Refuses to Let Him Stay Here

  • 15 రోజుల గడువు పొడిగించే అవకాశాల్లేవని స్పష్టీకరణ
  • ఆ తర్వాత ఏమి చేయాలో పాలుపోని గొటబాయ   
  • భారత్ లో ఆశ్రయం కోసం ప్రయత్నించగా, చుక్కెదురు

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇరకాటంలో పడ్డారు. శ్రీలంకలో సంక్షోభం ముదిరిపోవడం, ప్రజాగ్రహానికి భయపడిన ఆయన కుటుంబ సభ్యులతో కలసి గత బుధవారం మాల్దీవులకు పారిపోవడం, అక్కడి నుంచి సింగపూర్ చేరడం తెలిసిందే. అనంతరం సింగపూర్ నుంచి ఈ మెయిల్ ద్వారా రాజీనామాను శ్రీలంక స్పీకర్ కు పంపించారు. దీన్ని ఆమోదించడంతో ఆయన ఇప్పుడు మాజీ అధ్యక్షుడు అయ్యారు. ఈ క్రమంలో గొటబాయకు ఎక్కువ రోజులు ఆశ్రయం ఇచ్చేందుకు సింగపూర్ సుముఖంగా లేదు. 

సింగపూర్ లో ఉండేందుకు ఇచ్చిన 15 రోజుల సమయాన్ని పొడిగించే అవకాశం లేదని, మరో మార్గం చూసుకోవాలని రాజపక్సకు సింగపూర్ అధికారులు స్పష్టం చేసినట్టు తాజా సమాచారం. సింగపూర్ ఇచ్చిన 15 రోజుల తాత్కాలిక ఆశ్రయం తర్వాత ఏమి చేయాలన్న దానిపై గొటబాయలో స్పష్టత లేదని తెలుస్తోంది. ఆశ్రయం కోసం ఆయన భారత్ ను సైతం సంప్రదించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే శ్రీలంక ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా గొటబాయ రాజపక్సకు ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ నిరాకరించినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News