Godavari: శాంతించిన గోదారి... అయినా ఇంకా వందలాది గ్రామాల్లో వరద నీరు
- ఇటీవల భారీ వర్షాలు
- గోదావరికి పోటెత్తిన వరద
- ఆరు జిల్లాలపై గోదావరి పంజా
- ధవళేశ్వరం వద్ద నిలకడగా వరద ప్రవాహం
ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి మహోగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి శాంతించింది. గోదావరి నదికి వరద ఉద్ధృతి స్వల్పంగా తగ్గింది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం నిలకడగా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 23.30 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాగా, ఇంకా 241 గ్రామాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. ఆయా గ్రామాల్లో వరద నీరు తొలగిపోలేదు. గోదావరి వరదలతో 6 జిల్లాల్లోని 385 గ్రామాలు ప్రభావితం అయ్యాయి.