Chiranjeevi: వీళ్లిద్దరి బంధం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే 'ముద్దపప్పు-ఆవకాయ': 'లాల్ సింగ్ చడ్డా'లో కరీనా లుక్ విడుదల చేసిన చిరంజీవి

Chiranjeevi releases first look of Kareena Kapoor as Rupa fro Lal Singh Chaddha
  • ఆమిర్ ఖాన్ ప్రధానపాత్రలో లాల్ సింగ్ చడ్డా
  • రూప పాత్రలో కథానాయికగా కరీనా 
  • కీలకపాత్ర పోషించిన నాగచైతన్య
  • ఇటీవల చిరంజీవి నివాసంలో స్పెషల్ స్క్రీనింగ్
ఆమిర్ ఖాన్ ప్రధానపాత్రలో కరీనాకపూర్, నాగచైతన్య, మోనా సింగ్ తదితరులు నటించిన చిత్రం లాల్ సింగ్ చడ్డా. హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో కరీనా కపూర్ రూప పాత్ర పోషిస్తోంది. 

తాజాగా ఈ చిత్రం నుంచి కరీనా ఫస్ట్ లుక్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. "లాల్ సింగ్ చడ్డా నుంచి రూపను మీకు పరిచయం చేస్తున్నాను. వీళ్లిద్దరి బంధం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ముద్దపప్పు-ఆవకాయ" అని అభివర్ణించారు. 

ఇటీవలే హైదరాబాద్ వచ్చిన ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా చిత్రాన్ని చిరంజీవి నివాసంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ స్పెషల్ ప్రీమియర్ కు నాగార్జున, రాజమౌళి, సుకుమార్ హాజరయ్యారు. లాల్ సింగ్ చడ్డా చిత్రాన్ని వీక్షించిన అనంతరం చిరంజీవి... ఆమిర్ ఖాన్ ను ఆలింగనం చేసుకుని అభినందించారు. మెగాస్టార్ స్పందనతో ఆమిర్ ఖాన్ భావోద్వేగాలకు లోనై కంటతడి పెట్టుకున్నారు. 

'లాల్ సింగ్ చడ్డా' చిత్రం ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులోనూ ఇదే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Chiranjeevi
Kareena Kapoor
Roopa
First Look
Lal Singh Chaddha

More Telugu News