Andhra Pradesh: 8 నెలల ముందే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ
- వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న స్థానాలు
- ఎమ్మెల్యేలతో మాట్లాడిన అనంతరం అభ్యర్థులను ఖరారు చేసిన జగన్
- అనంతపురం-కడప-కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థిపైనా చర్చ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు 8 నెలల ముందే ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. వచ్చే ఏడాది మార్చిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవనున్నాయి. విశాఖ-శ్రీకాకుళం-విజయనగరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, అనంతపురం-కడప-కర్నూలుకు అదే స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెన్నపూస గోపాల్‌రెడ్డి కుమారుడు రవీంద్రరెడ్డి, చిత్తూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాల నియోజకవర్గానికి పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి పేర్లను ఖరారు చేశారు.
వీరి ఎంపికకు సంబంధించి ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ వీరిని ఖరారు చేశారు. కాగా, అనంతపురం-కడప-కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో చర్చ జరిగినా తర్వాత ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.