Commonwealth Games: కామన్వెల్త్ క్రీడల్లో బాగా ఆడాలంటూ.. భారత అథ్లెట్లకు ఓ సామెతను గుర్తు చేసిన ప్రధాని మోదీ

PM Modi interacts with Indian contingent bound for CWG
  • కామన్వెల్త్ క్రీడల్లో పోటీపడే క్రీడాకారులతో వర్చువల్ గా మాట్లాడిన ప్రధాని
  • వాళ్లలో స్ఫూర్తినింపే ప్రయత్నం చేసిన మోదీ
  • ఈ నెల 28 నుంచి బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు 
బర్మింగ్‌హామ్‌ వేదికగా ఈ నెల 28 నుంచి జరిగే ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో పోటీ పడబోయే భారత క్రీడాకారుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తి నింపారు. ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులతో బుధవారం వర్చువల్ గా మాట్లాడారు. ‘ఒత్తిడి లేకుండా మీ పూర్తి శక్తి సామర్థ్యాలతో బాగా ఆడండి. మిమ్మల్ని ఎవ్వరూ ఢీకొట్టలేరు. ఎందుకా నీరసం అనే సామెతను వినే ఉంటారు కదా. కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా ఇదే వైఖరితో ఆడండి’ అని భారత కామన్వెల్త్ జట్టుతో ప్రధాని మోదీ అన్నారు.

కామన్వెల్త్ క్రీడల కోసం భారత ఒలింపిక్ సంఘం 322 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇందులో 215 మంది అథ్లెట్లు, 107 మంది అధికారులు, సహాయక సిబ్బంది ఉన్నారు. గోల్డ్ కోస్ట్‌ వేదికగా జరిగిన 2018 కామన్వెల్త్ గేమ్స్ లో భారత జట్టు... ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తర్వాత మూడో స్థానంలో నిలిచింది. ఈ సారి బలమైన జట్టును కామ్వన్వెల్త్ కు పంపిస్తున్నామని భారత ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా అన్నారు. ఈసారి షూటింగ్ లేకపోయినా.. గత ఎడిషన్ తో ఈసారి మెరుగైన ఫలితాలు ఆశిస్తున్నానని చెప్పారు. కాగా, కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి మహిళల క్రికెట్ ను ప్రవేశ పెట్టారు.
Commonwealth Games
Narendra Modi
India
athlets
interaction

More Telugu News