Sensex: వరుసగా నాలుగో రోజు లాభపడ్డ మార్కెట్లు
- 630 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 180 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 3.61 శాతం పెరిగిన టెక్ మహీంద్రా షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా నాలుగో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. యూరప్ కు రష్యా గ్యాస్ సరఫరా మళ్లీ ప్రారంభం కాబోతోందనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 630 పాయింట్లు లాభపడి 55,398కి చేరుకుంది. నిఫ్టీ 180 పాయింట్లు పెరిగి 16,521 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (3.61%), టీసీఎస్ (2.89%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.81%), రిలయన్స్ (2.47%), ఇన్ఫోసిస్ (2.02%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-1.80%), సన్ ఫార్మా (-0.87%), కోటక్ బ్యాంక్ (-0.48%), ఏసియన్ పెయింట్స్ (-0.46%), భారతి ఎయిర్ టెల్ (-0.40%).