Naga Chaitanya: 'బాలరాజు'ను పరిచయం చేసిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi introduces Akkineni Naga Chaitanya as Balaraju from Lal Singh Chadda
  • ఆమిర్‌ ఖాన్‌, కరీనా జంటగా లాల్ సింగ్ చడ్డా
  • కీలకపాత్రలో నాగచైతన్య
  • బాలరాజుగా నటిస్తున్న వైనం
  • అలనాటి బాలరాజు మనవడే ఈ బాలరాజు అంటూ చిరు ట్వీట్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ ఖాన్‌ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఇందులో టాలీవుడ్ నటుడు నాగచైతన్య ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఆయన పాత్ర పేరు బాలరాజు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా బాలరాజు పాత్రను అందరికీ పరిచయం చేశారు. అలనాటి బాలరాజు (ఏఎన్నార్) మనవడు అక్కినేని నాగచైతన్యే ఈ బాలరాజు అంటూ చిరు ట్వీట్ చేశారు. 

దీనిపై నాగచైతన్య స్పందించారు. ఈ పాత్ర తన కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోతుందని తెలిపారు. తన 'బాలా' ఆమిర్‌ ఖాన్‌ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, విశేష రీతిలో మద్దతు తెలుపుతున్నారంటూ మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు.
Naga Chaitanya
Balaraju
Lal Singh Chadda
Chiranjeevi
Amir Khan
Bollywood
Tollywood

More Telugu News