Sensex: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 21,566 పాజిటివ్ కేసుల నమోదు
- కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 18,294
- 1,48,881కి చేరిన యాక్టివ్ కేసులు
మన దేశంలో కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 21,566 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 18,294 మంది కరోనా నుంచి కోలుకోగా... 45 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,48,881కి పెరిగింది.
ఇప్పటి వరకు దేశంలో 4,31,50,434 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 5,25,870 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.25 శాతంగా, క్రియాశీల రేటు 0.33 శాతంగా, రికవరీ రేటు 98.47 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,00,91,91,969 డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 29,12,855 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.