Shikhar Dhawan: వన్డే ఇన్నింగ్స్ ఓపెనర్ గా రుతురాజ్ సరైనోడు..: వసీం జాఫర్

Ruturaj Gaikwad should make his ODI debut and open with Shikhar Dhawan against West Indies
  • ఓపెనర్ గా అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉందన్న జాఫర్
  • శిఖర్ ధావన్ తో కలసి ఇన్నింగ్స్ ఆరంభించాలని సూచన
  • ఎడమ, కుడి చేతి వాటం కలయిక ఫలితమిస్తుందన్న అభిప్రాయం
టీమిండియా - వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ ఈ నెల 22 నుంచి మొదలు కానుంది. ఈ సిరీస్ కు శిఖర్ ధావన్ కెప్టెన్ గా సేవలు అందించనున్నాడు. మూడు వన్డేల సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి నిచ్చారు. ఇక ఈ వన్డే సిరీస్ లో భారత జట్టు ఇన్నింగ్స్ ను శిఖర్ ధావన్ తో కలసి, రుతురాజ్ గైక్వాడ్ ఆరంభించడం మంచిదని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సూచించాడు.

‘‘రుతురాజ్ వన్డేల్లో అరంగేట్రం చేసి, శిఖర్ ధావన్ తో కలసి వెస్టిండీస్ పై ఇన్నింగ్స్ ను ప్రారంభించాలని నేను భావిస్తున్నాను. విజయ్ హజారే ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్ లలో రుతురాజ్ గైక్వాడ్ నాలుగు సెంచరీలు చేశాడు. లెఫ్ట్, రైట్ బ్యాటింగ్ కాంబినేషన్ కూడా చక్కగా కుదురుతుంది’’ అని వసీంజాఫర్ ట్వీట్ చేశాడు. ఓపెనర్ గా రుతురాజ్ గైక్వాడ్ కు ఉన్న మంచి రికార్డును జాఫర్ ప్రస్తావించాడు. 64 ఏ గేమ్స్ లో అతడు 3,284 పరుగులు చేసి, 54.73 సగటు స్ట్రయిక్ రేటుతో ఉన్నట్టు గుర్తు చేశాడు.
Shikhar Dhawan
Ruturaj Gaikwad
West Indies
ODI
opener
Wasim Jaffer

More Telugu News