Vijayasai Reddy: ఏపీపీ కంపెనీ దివాలా తీసింది.... చంద్రబాబు వేసిన పునాది రాళ్లన్నిటికీ ఇదే గతి!: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy criticizes Chandrababu over APP Industry at Ramayapatnam Port

  • 2019లో ఏపీపీతో అప్పటి సర్కారు ఒప్పందం
  • రూ.24 వేల కోట్లతో పేపర్ మిల్లు ఏర్పాటుకు నిర్ణయం
  • ఆ కంపెనీ పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుందన్న విజయసాయి

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టుకు అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయగా, భారీ పరిశ్రమ స్థాపించేందుకు ఆసియా పల్ప్ అండ్ పేపర్ (ఏపీపీ) కంపెనీ ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి, ఏపీపీకి మధ్య రూ.24 వేల కోట్ల అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. అయితే, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలుకాగా, వైసీపీ సర్కారు గద్దెనెక్కింది. ఆ తర్వాత రామాయపట్నం ప్రాజెక్టు పనులు ఆశించినంత వేగంగా జరగలేదు. ఏపీపీ కంపెనీ ఊసే లేకుండా పోయింది. 

ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీపీ కంపెనీ రూ.24 వేల కోట్లతో రామాయపట్నంలో పేపర్ మిల్లు పెడుతోందని చంద్రబాబు హడావుడిగా భూమి పూజ చేశారని ఎద్దేవా చేశారు. ఆ కంపెనీ ఇప్పుడు పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుని దివాలా పిటిషన్లు వేసిందని వెల్లడించారు. పేపర్ మిల్లు పెట్టడంలేదని చేతులెత్తేసిందని తెలిపారు. చంద్రబాబు వేసిన పునాది రాళ్లన్నింటికీ ఇదే గతి అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News