Nasa: చంద్రుడిపై మనుషుల అడుగుజాడలు ఇవిగో.. వీడియో విడుదల చేసిన నాసా

NASA shares incredible video of Neil Armstrong Buzz Aldrins footprints on moon

  • 50 ఏళ్ల కిందట చందమామపైకి వెళ్లిన వారి అడుగు జాడలు ఇప్పటికీ చెరిగిపోకుండా ఉన్న వైనం
  • లూనార్ రీకన్నీసన్స్ ఆర్బిటర్ తీసిన దృశ్యాలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన నాసా
  • త్వరలో మరోసారి చంద్రుడిపైకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఆసక్తి

ఎప్పుడో 53 ఏళ్ల కింద అపోలో 11 మిషన్ చంద్రుడిపై ల్యాండ్ అయింది. మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ఇద్దరూ చంద్రుడిపై అడుగుపెట్టారు. చందమామపై కొంత దూరం అటూ ఇటూ నడిచి పరిశీలించారు. చంద్రుడిపై వాతావరణం లేకపోవడం వల్ల నాటి ఆ అడుగుల జాడలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దీనికి సంబంధించి నాసా ప్రత్యేకంగా చిత్రీకరించిన వీడియోను తాజాగా విడుదల చేసింది. చందమామపైకి మళ్లీ వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో.. చెరిగిపోని నాటి అడుగుల గుర్తులను మళ్లీ చూపింది.

‘‘చంద్రుడి చుట్టూ తిరుగుతున్న లూనార్ రీకన్సీసన్స్ ఆర్బిటర్ తో జూమ్ చేస్తూ తీసిన వీడియో ఇది. నాడు చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాముల అడుగులు ఇంకా అలాగే ఉన్నాయి.’’ అని నాసా పేర్కొంది.

లూనార్ రీకన్నీసన్స్ ఆర్బిటర్  ఉపగ్రహాన్ని నాసా 2009లో ప్రయోగించింది. అప్పటి నుంచీ చంద్రుడిని చుట్టేస్తూ అక్కడి విశేషాలను చిత్రిస్తూ భూమికి పంపుతోంది. ఆ ఉప గ్రహం ఇప్పటివరకు 1.4 పెటా బైట్స్ డేటా పంపిందని.. ఇది 50 వేల కోట్ల పేజీలతో సమానమైన సమాచారమని నాసా వెల్లడించింది.

  • Loading...

More Telugu News