Google: ఏఐ చాట్‌బాట్ సైంటిస్ట్‌లా వ్యవహరిస్తోందన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గూగుల్ వేటు

Google fires software engineer who claimed its AI chatbot is sentient

  • ‘లామ్డా’ ఒక శాస్త్రవేత్తలా ఆలోచిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బ్లేక్
  • వెంటనే సెలవుపై పంపిన గూగుల్
  • బ్లేక్ ఆరోపణలను పూర్తిగా ఖండించిన గూగుల్
  • తాజాగా అతడిని తొలగిస్తున్నట్టు ప్రకటన

గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ లామ్డా (LaMDA) ఓ శాస్త్రవేత్తలా వ్యవహరిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గూగుల్ వేటేసింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన బ్లేక్ లెమోయిన్‌ గత నెలలో మాట్లాడుతూ.. గూగుల్ చాట్‌బాట్ స్వీయ అవగాహన కలిగిన వ్యక్తిలా ప్రవర్తిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

దీనిని తీవ్రంగా పరిగణించిన గూగుల్.. వెంటనే ఆయనను సెలవుపై పంపింది. తాజాగా ఆయనను తొలగించినట్టు పేర్కొంది. బ్లేక్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొన్న గూగుల్.. కంపెనీ విధివిధానాలను ఉల్లంఘించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఉపాధి, డేటా భద్రత విధానాలను బ్లేక్ ఉల్లంఘించడం విచారకరమని పేర్కొంది. 

లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్ (లామ్డా) గురించి గూగుల్ గతేడాదే వెల్లడించింది. డైలాగ్‌పై శిక్షణ పొందిన ట్రాన్స్‌ఫార్మర్ ఆధారిత లాంగ్వేజ్ నమూనాలు దేనిగురించైనా మాట్లాడడం నేర్చుకోగలవని నిరూపించే పరిశోధనలో భాగంగా రూపొందించినట్టు తెలిపింది.  లాంగ్వేజ్ మోడల్‌కు ఇది సంక్షిప్తమైనదని వివరించింది.

  • Loading...

More Telugu News