Brian Lara: లారాతో ద్రావిడ్.. టూ లెజెండ్స్ ఇన్ వన్ ఫ్రేమ్ అంటూ బీసీసీఐ కామెంట్
- వెస్టిండీస్ టూర్‌లో టీమిండియా
- లారా పుట్టినిల్లు ట్రినిడాడ్‌లో నిన్న తొలి వన్డే
- టీమిండియా హెడ్ కోచ్ హోదాలో వెళ్లిన ద్రావిడ్
- ఇద్దరూ కలిసి ఫొటో దిగిన వైనం
బ్రయన్ లారా... వెస్టిండీస్ జట్టులో స్టార్ బ్యాటర్‌గా ఎదిగిన క్రికెటర్. ఇక వరల్డ్ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. చాలా కాలం క్రితమే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన లారా... ప్రస్తుతం ఐపీఎల్‌లో మన హైదరాబాదీ జట్టు సన్‌రైజర్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఇక లారా మాదిరే రాహుల్ ద్రావిడ్ కూడా వరల్డ్ క్రికెట్‌లో తనకూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. వికెట్ల ముందు ద్రావిడ్ ఉంటే... వికెట్ పడగొట్టడం బౌలర్లకు చాలా కష్టమే. అందుకే ద్రావిడ్‌కు మిస్టర్ డిపెండబుల్ అని పేరు. ద్రావిడ్ కూడా చాలా కాలం క్రితమే జెంటిల్మన్ గేమ్‌కు గుడ్ బై చెప్పేసి ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ట్రినిడాడ్‌లో వెస్టిండీస్ జట్టుతో తొలి వన్డే కూడా ఆడింది. ట్రినిడాడ్ లారా పుట్టినిల్లు. ఈ క్రమంలో నిన్నటి మ్యాచ్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రావిడ్, స్థానికుడిగా లారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ఓ ఫొటో దిగారు. దీనికి 'టూ లెజెండ్స్ ఇన్ వన్ ఫ్రేమ్' అంటూ క్యాప్షన్ పెట్టి బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.