Telangana: టీఆర్ఎస్కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రుడు తెజావత్ రాజీనామా
- తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా కొనసాగుతున్న తెజావత్
- ఐఏఎస్ అధికారిగా సేవలందించిన రామచంద్రుడు
- త్వరలోనే బీజేపీలో చేరతారంటూ ప్రచారం
- రామచంద్రుడు రాజీనామాను ప్రశంసించిన ఆర్ఎస్ ప్రవీణ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ టీఆర్ఎస్కు శనివారం ఎదురు దెబ్బ తగిలింది. పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా కొనసాగుతున్న రామచంద్రుడు తెజావత్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆయన టీఆర్ఎస్ అధిష్ఠానానికి పంపడంతో పాటుగా మీడియాకూ విడుదల చేశారు. టీఆర్ఎస్కు తాను ఎందుకు రాజీనామా చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన తన రాజీనామా లేఖలో ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్కు రాజీనామా చేసిన రామచంద్రుడు త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై అంతగా స్పష్టత లేకున్నా... బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం రామచంద్రుడు టీఆర్ఎస్కు రాజీనామా చేసిన వైనాన్ని ప్రశంసించారు. ఇప్పటికైనా టీఆర్ఎస్, కేసీఆర్ నిజస్వరూపాన్ని తెలుసుకుని సంకెళ్లు తెంచుకుని రామచంద్రుడు బయటపడ్డారని ఆయన తెలిపారు. ఆత్మ గౌరవానికి మించిన ఆభరణం లేదని సూచించిన ప్రవీణ్ టీఆర్ఎస్ వద్ద దగాపడ్డ నాయకులంతా ఈ విషయాన్ని గుర్తించాలని, దొరల పోకడలపై పోరాడాలని పిలుపునిచ్చారు.