Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రాకు రజతం

Neeraj wins silver In World Athletics Championships 2022

  • ఫైనల్‌లో  88.39 మీటర్ల దూరం విసిరిన నీరజ్
  • నాలుగో ప్రయత్నంలో పతకం సాధించిన ఒలింపిక్ వీరుడు
  •  2009 తర్వాత ఒలింపిక్, ప్రపంచ అథ్లెటిక్ పథకాలను గెలుచుకున్న క్రీడాకారుడిగా గుర్తింపు

అమెరికాలోని యుజీన్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రజతం కైవసం చేసుకున్నాడు. గ్రూప్-ఏ క్వాలిఫికేషన్ రౌండ్‌లో తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరి నేరుగా పురుషుల జావెలిన్ త్రో ఫైనల్‌కు దూసుకెళ్లిన నీరజ్.. నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.  

ఇటీవల స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్ల దూరం విసిరి సరికొత్త జాతీయ రికార్డు సృష్టించిన నీరజ్.. 90 మీటర్ల దూరానికి 6 సెంటీమీటర్ల దూరంలో నిలిచాడు. తాజాగా, నేడు జరిగిన ఫైనల్‌లో 88.13 మీటర్ల దూరం విసిరి పతకం పట్టాడు. 2009 తర్వాత ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు రెండింటినీ గెలుచుకున్న అథ్లెట్‌గా నీరజ్ చోప్రా రికార్డులకెక్కాడు.

  • Loading...

More Telugu News