Hyderabad: హైదరాబాద్‌లో భవనం పైనుంచి పడి ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి

Engineering Student dead by accidentally falls from Hostel building
  • ఇబ్రహీంపట్నంలో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న రమ్య
  • రెండో అంతస్తులో రెయిలింగ్‌పై కూర్చుని మాట్లాడుతుండగా పట్టుతప్పి కిందపడిన వైనం
  • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృతి
హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ విద్యార్థిని హాస్టల్ భవనం పైనుంచి పడి మృతి చెందింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తికి చెందిన రమ్య (21) ఇబ్రహీంపట్నంలోని శ్రీదత్త ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. వీరి కుటుంబం ఉప్పల్‌లో నివసిస్తోంది. అక్కడి నుంచి కళాశాల దూరంగా ఉండడంతో గత కొంతకాలంగా రమ్య బీఎన్‌రెడ్డి నగర్‌లోని లక్ష్మీ దుర్గా విమెన్స్ హాస్టల్‌లో ఉంటోంది. 

గత రాత్రి హాస్టల్ రెండో అంతస్తు పైనున్న రెయిలింగ్‌పై కూర్చుని స్నేహితులతో మాట్లాడుతున్న రమ్య.. అదుపుతప్పి ఒక్కసారిగా కిందపడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Engineering Student
Uppal
Vanaparthy

More Telugu News