CBI: వివేకా హత్య కేసు... ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్
- వివేకా హత్య కేసులో ఏ-1గా ఉన్న గంగిరెడ్డి
- గంగిరెడ్డికి గతంలో బెయిల్ మంజూరు చేసిన సెషన్స్ కోర్టు
- బెయిల్ రద్దు చేయాలని గతంలో హైకోర్టులో పిటిషన్ వేసిన సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలక నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మర్డర్ కేసులో ఎర్ర గంగిరెడ్డి ఏ-1గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన సెషన్స్ కోర్టు గతంలో ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో, గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ మొదట హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం సీబీఐ విన్నపాన్ని తోసిపుచ్చింది. ఈ క్రమంలో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది.