Aamir Khan: 'గాడ్ ఫాదర్' లో నన్ను కాకుండా సల్మాన్ ను ఎందుకు తీసుకున్నారన్న ఆమిర్ ఖాన్... చిరంజీవి జవాబు ఇదిగో!

Interesting conversation between Aamir Khan and Chiranjeevi
  • ఆమిర్ ఖాన్ హీరోగా లాల్ సింగ్ చడ్డా
  • చిరంజీవి సమర్పణలో తెలుగు వెర్షన్
  • చిత్రంలో కీలకపాత్రలో నాగచైతన్య
  • లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్ ఈవెంట్లో ఆసక్తికర సంభాషణ
'లాల్ సింగ్ చడ్డా' సినిమా ప్రమోషన్ల కోసం బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ గత కొన్నిరోజులుగా హైదరాబాదులో సందడి చేస్తున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తుండడం, ఇందులో నాగచైతన్య నటిస్తుండడంతో సినిమాపై మాంచి హైప్ నెలకొంది. నిన్న ఈ సినిమాకు సంబంధించి జరిగిన ప్రచార కార్యక్రమంలో హీరో ఆమిర్ ఖాన్ తో పాటు చిరంజీవి, నాగచైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్, చిరంజీవి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. 

తనకు తెలుగు సినిమాల్లో నటించాలని ఉందని... చిరంజీవి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమిర్ ఖాన్ చెప్పారు. అనంతరం మాట్లాడుతూ... గతంలో చిరంజీవితో కలిసి నటించాలని ఉందని చెప్పానని, తప్పకుండా అవకాశం ఇస్తానని చిరంజీవి చెప్పారని వెల్లడించారు. కానీ 'గాఢ్ ఫాదర్' చిత్రంలో సల్మాన్ ఖాన్ ను తీసుకున్నామని చిరంజీవే రెండ్రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్పారని ఆమిర్ వివరించారు. 

నన్ను కాకుండా సల్మాన్ ను ఎందుకు తీసుకున్నారని చిరంజీవిని అడిగినట్టు చెప్పారు. అందుకు చిరంజీవి... ఇది హృదయం, బుద్ధిబలానికి సంబంధించిన పాత్ర కాదని, కండబలానికి ప్రాముఖ్యత ఉన్న పాత్ర కావడంతో సల్మాన్ ఖాన్ ను ఎంపిక చేసుకున్నామని వివరణ ఇచ్చారని ఆమిర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Aamir Khan
Chiranjeevi
Lal Singh Chadda
Naga Chaitanya

More Telugu News