Komatireddy Raj Gopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ఆరా తీస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం

Congress high command focus on Komatireddy Rajagopal Reddy
  • కేసీఆర్ ను ఓడించే సత్తా బీజేపీకే ఉందన్న కోమటిరెడ్డి 
  • కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారిన కోమటిరెడ్డి అంశం
  • కోమటిరెడ్డి వ్యాఖ్యల క్లిప్పింగ్ లను తెప్పించుకున్న మాణికం ఠాగూర్
తెలంగాణలో కేసీఆర్ ను ఓడించే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశానని... మర్యాదపూర్వకంగానే ఆయనను కలిశానని చెప్పారు.

మరోవైపు బీజేపీకి అనుకూలంగా కోమటిరెడ్డి మాట్లాడుతుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం అలర్ట్ అయింది. కోమటిరెడ్డి వ్యవహారం గురించి ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ లను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ తెప్పించుకున్నారట. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పార్టీపై సాగర్ ఉప ఎన్నిక సమయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్స్ ను కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి అంశం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Komatireddy Raj Gopal Reddy
Congress
BJP
Manickam Tagore

More Telugu News