Eyes: గడియారాన్ని చూసినప్పుడు తొలి సెకన్​ లేటుగా కదులుతుంది.. అందుకు కారణమిదే..!

 When you look at the clock the first second moves slowly This is the reason

  • కళ్లు కదిలే విధానంలో రెండు రకాలు.. దృష్టి వేగాన్ని బట్టి మెదడు ప్రాసెసింగ్
  • వేగంగా కళ్లు కదిలే విధానంలో దృశ్యాన్ని భిన్నంగా చూపే మెదడు
  • కదిలే వస్తువులపైకి ఒక్కసారిగా దృష్టి మరల్చినప్పుడు.. ఆలస్యమైనట్టు కనిపిస్తుందన్న నిపుణులు

మనం ఎప్పుడైనా గడియారం వైపు చూస్తే.. అందులో తొలి సెకన్ ఆలస్యంగా గడవడాన్ని గమనించారా? సెకన్ల ముల్లు మొదట మెల్లగా కదిలి, తర్వాత యథాతథంగా ముందుకెళ్తున్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? సాధారణంగా ఎక్కువ మంది దీనిని పెద్దగా గమనించడం కష్టమేగానీ.. కొందరికి మాత్రం ఇది అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు కావాలని చూసినా.. ఆ తేడా ఏమిటనేది తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది సాధారణ విషయం కాదని.. దీని వెనుక ఎంతో సైన్స్ ఉందని అంటున్నారు. యూట్యూబ్ లో అసాప్ సైన్స్ అనే సైంటిఫిక్ చానల్ ఈ దృశ్య చిత్రం వెనుక ఉన్న కారణాలను ఇటీవల వివరించింది. 

రెండు రకాల దృష్టి.. ప్రాసెసింగ్ తో..
మనం కళ్లతో చూసేది అంతా ఒకటే అనుకుంటుంటాం. కానీ ఈ చూసే విధానం రెండు రకాలుగా ఉంటుంది. ఒక రకమేమో.. ఒకే చోట ఉన్నదిగానీ, కదులుతూ వెళ్తున్నదిగానీ ఓ వస్తువును అలాగే చూస్తూ ఉండటం. దీనిని స్మూత్ పర్స్యూట్ విధానం అంటారు. ఇక ఏదైనా ఒకచోటి నుంచి మరోచోటికిగానీ, వస్తువు మీదికిగానీ వేగంగా దృష్టిని మరల్చడం రెండో రకం. దీనిని సక్కాడెస్ విధానం అంటారు. ఈ రెండింటిలో కళ్లు చూసే విధానం, దాన్ని మెదడు ప్రాసెసింగ్ చేసే తీరు భిన్నంగా వుంటాయని నిపుణులు చెబుతున్నారు.

  • స్మూత్‌ పర్స్యూట్‌ విధానం అంటే.. ఉదాహరణకు దూరంగా వెళుతున్న రైలునుగానీ, ఆకాశంలో వెళ్తున్న పక్షినిగానీ మనం చూస్తూ ఉంటాం. అవి కదులుతున్న కొద్దీ మన కళ్లు కదులుతూ వాటిని స్పష్టంగా చూస్తుంటాయి. ఈ డేటాను మెదడు వేగంగా ప్రాసెస్ చేయడం వల్ల దృష్టి స్పష్టంగా కనిపిస్తుంది.
  • అదే సక్కాడెస్ విధానంలో కళ్లు వేగంగా ఒకచోటి నుంచి మరోచోటికి దృష్టి మరలించడం వల్ల.. ఆ రెండింటి మధ్య ఉన్నవేవీ కనబడవు. వాటిని మెదడు ప్రాసెస్ చేయదు. అందువల్ల మొదటి చోటి నుంచి రెండో చోటికి దృష్టిని మరల్చినప్పుడు గడిచిన సమయాన్ని కూడా రెండో చోట చూసే దృశ్యానికి కలిపేస్తుంది. అందువల్ల అక్కడి దృశ్యం.. గడిచిన దానికంటే కాస్త ఎక్కువసేపు గడిచినట్టు అనిపిస్తుంది. అయితే ఇది అతితక్కువ సమయం కాబట్టి మనం పెద్దగా గుర్తించలేం.
  • ఈ సక్కాడెస్ దృష్టి విధానం వల్లే.. మనం గడియారాన్ని చూసిన వెంటనే గడిచే తొలి సెకన్ ఎక్కువ సేపు ఉన్నట్టు అనిపిస్తుంది. ముల్లు కదలడానికి తొలి సెకన్ కు ఎక్కువ సమయం తీసుకున్న భావన కలుగుతుంది. తర్వాత మనం అలాగే చూస్తుండటం వల్ల రెండో సెకన్ నుంచి మామూలుగానే ఉన్న ఫీలింగ్ ఉంటుంది.
  • ఇది కేవలం గడియారం విషయంలోనే కాకుండా.. ఆగుతూ, కదులుతూ ఉండే ఏ వస్తువు విషయంలోనైనా సరే.. ఒక్కసారిగా దృష్టి సారిస్తే తొలుత ఆలస్యం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News