YSRCP: తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌, త‌మిళ‌నాడు ఎంపీల‌తో ర‌ఘురామ‌రాజు... ఫొటో ఇదిగో

ysrcp revel mp raghuramakrishna raju post a photo with tamailisai and dmk mp Thamizhachi Thangapandian
  • పార్ల‌మెంటులో రాష్ట్రప‌తిగా ప్ర‌మాణం చేసిన ముర్ము
  • త‌మిళిసై, డీఎంకే ఎంపీల‌తో ర‌ఘురామ ఫొటో
  • సోష‌ల్ మీడియాలో ఫొటో పంచుకున్న వైసీపీ రెబ‌ల్ ఎంపీ
భార‌త నూత‌న రాష్ట్ర‌ప‌తిగా ద్రౌప‌ది ముర్ము సోమ‌వారం ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్ ఎంపీలు, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, ఆయా రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ల‌తో కోలాహ‌లంగా క‌నిపించింది. ఈ సంద‌ర్భంగా రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి తాము కూడా హాజ‌ర‌య్యామంటూ దాదాపుగా అంద‌రు నేత‌లు త‌మ త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో ఫొటోల‌ను పంచుకున్నారు.

అయితే ప్ర‌తిదీ విభిన్నంగా క‌నిపించాల‌ని కోరుకునే వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు మాత్రం ఇదే వేదిక‌గా విభిన్న అంశంతో కూడిన ట్వీట్‌ను చేశారు. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గానే కాకుండా పుదుచ్ఛేరి లెఫ్ట్ నెంట్ గ‌వర్న‌ర్‌గా కూడా కొన‌సాగుతున్న త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌తో పాటు త‌మిళ‌నాడుకు చెందిన డీఎంకే మ‌హిళా ఎంపీ త‌మిజాచ్చి తంగ‌పాండియ‌న్‌ల‌ను క‌లిశానంటూ ఓ ఫొటో పోస్ట్ చేశారు.
YSRCP
Raghu Rama Krishna Raju
Parliament
Tamilisai Soundararajan
Thamizhachi Thangapandian
Tamilnadu
DMK

More Telugu News