Monk: నిటారుగా ఉన్న కొండను సునాయాసంగా ఎక్కేస్తున్న బౌద్ధ సన్యాసి
- నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
- తాడు, చేతుల సాయం లేకుండానే కొండను ఎక్కేసిన సాధువు
- యోగా, ధ్యానం, సాధనవల్లే సాధ్యమన్న కామెంట్లు
నిటారుగా ఉన్న కొండను ఎక్కాలంటే నిజంగా సాహస విన్యాసమే అవుతుంది. తాళ్ల సాయంతో సునాయాసంగా ఎక్కే వారు ఉంటారు. మరి ఏ సాయమూ లేకుండా, అది కూడా కేవలం రెండు కాళ్ల సాయంతోనే సునాయాసంగా కొండలను ఎక్కేస్తున్న బౌద్ధ సన్యాసి గురించి చెప్పుకోవాల్సిందే. బౌద్ధ సన్యాసి కొండను ఎక్కుతున్న వీడియోను తన్సు యేగెన్ అనే వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేయగా, అది మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియో పాతది కావడం గమనించాలి.