YSRCP: మాస్ట‌ర్స్‌ను డిస్టింక్ష‌న్‌లో పూర్తి చేసిన‌ చెవిరెడ్డి కుమారుడు.. ఉప్పొంగిపోయిన వైసీపీ ఎమ్మెల్యే

ysrcp mla chevireddy son mohith reddy passed masters degree in distinction at University of Warwick
  • లండ‌న్‌లోని వార్విక్‌లో చ‌దువు పూర్తి చేసిన మోహిత్ రెడ్డి
  • బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్‌లో మాస్ట‌ర్స్ పూర్తి చేసిన వైనం
  • స్నాత‌కోత్స‌వానికి హాజ‌రైన చెవిరెడ్డి దంప‌తులు
రాజ‌కీయ నేత‌ల పిల్ల‌లు చ‌దువులో స‌త్తా చాటుతున్నారు. ఇప్ప‌టికే ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూతురు వ‌ర్షిణి రెడ్డి ఫ్రాన్స్ యూనివ‌ర్సిటీలో డిస్టింక్ష‌న్‌లో మాస్ట‌ర్స్ పూర్తి చేయ‌గా.. అదే బాట‌లో న‌డిచిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి కూడా త‌న మాస్ట‌ర్స్ డిగ్రీని డిస్టింక్ష‌న్‌లోనే పూర్తి చేశారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డిస్తూ చెవిరెడ్డి తండ్రిగా త‌న‌కు గ‌ర్వంగా ఉందంటూ ఉప్పొంగిపోయారు.

లండ‌న్‌లోని వార్విక్ యూనివ‌ర్సిటీలో మోహిత్ రెడ్డి బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్‌లో మాస్ట‌ర్స్ కోర్సు పూర్తి చేశారు. 'మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్'లో మాస్టర్ డిగ్రీని ఆయన అందుకున్నారు. అది కూడా డిస్టింక్ష‌న్‌లో ఈ ప‌ట్టాను ఆయ‌న‌ అందుకున్నారు. బుధ‌వారం వర్సిటీలో జ‌రిగిన స్నాత‌కోత్సవంలో ఆయ‌న ప‌ట్టా అందుకోగా... ఈ వేడుక‌కు చెవిరెడ్డి దంప‌తులు హాజ‌ర‌య్యారు.
YSRCP
Chevireddy Bhaskar Reddy
Chevireddy Mohith Reddy
University of Warwick
Masters Degree

More Telugu News