Sensex: వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 712 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 229 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 7.27 శాతం పెరిగిన టాటా స్టీల్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. రూపాయి బలపడటంతో పాటు అంతర్జాతీయంగా సానుకూలతలు ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 712 పాయింట్లు లాభపడి 57,570కి చేరుకుంది. నిఫ్టీ 229 పాయింట్లు పెరిగి 17,158 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (7.27%), సన్ ఫార్మా (5.45%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.64%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.51%), ఏసియన్ పెయింట్స్ (2.38%).
టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ (-3.96%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.97%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.77%), ఐటీసీ (-0.13%), యాక్సిస్ బ్యాంక్ (-0.06%).