Monkeypox Virus: ‘మంకీపాక్స్’తో వణికిపోతున్న న్యూయార్క్.. అత్యవసర పరిస్థితి ప్రకటన

1 in 4 monkeypox cases in US in New York Virus sparks fresh alarm
  • ప్రతి నాలుగు కేసుల్లో ఒకటి న్యూయార్క్ రాష్ట్రంలోనే
  • దేశవ్యాప్తంగా 5,189 కేసులు
  • న్యూయార్క్ లో 1,345 కేసులు 
  • ఇల్లినాయిస్, క్యాలిఫోర్నియాలోనూ అధికమే
మంకీపాక్స్ వైరస్ కేసుల వ్యాప్తి మరీ అంత వేగంగా లేకపోయినా.. ప్రపంచ దేశాలు ఒక్కోదానికీ ఇది పాకిపోతోంది. అక్కడి పాలకులకు తలనొప్పిగా తయారవుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఇది ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. న్యూయార్క్ రాష్ట్రాన్ని మంకీపాక్స్ ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే అమెరికాలోని ప్రతీ నాలుగు మంకీపాక్స్ కేసుల్లో ఒకటి న్యూయార్క్ లోనే ఉంది. దీంతో విపత్తు అత్యయిక స్థితిగా న్యూయార్క్ రాష్ట్రం ప్రకటించాల్సి వచ్చింది. ట్విట్టర్ లో న్యూయార్క్ గవర్నర్ కాచీ హోచుల్ దీనిపై ప్రకటన చేశారు. వైరస్ తీవ్రతను తెలియజెప్పే ప్రయత్నం చేశారు.

‘‘దేశంలోని ప్రతి నాలుగు మంకీపాక్స్ కేసుల్లో ఒకటి కంటే ఎక్కువ న్యూయార్క్ లోనే ఉన్నాయి. రిస్క్ గ్రూపులపై దీని ప్రభావం అసాధారణంగా ఉంది. మరిన్ని టీకాలను సమకూర్చుకునేందుకు విశ్రమించకుండా పనిచేస్తున్నాం. టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుతున్నాం. సురక్షితంగా ఎలా ఉండాలన్న దానిపై న్యూయార్క్ వాసులకు తెలియజేస్తున్నాం. మంకీపాక్స్ నివారణకు మేం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా రాష్ట్ర అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నా’’ అంటూ న్యూయార్క్ మహిళా గవర్నర్ అయిన హోచుల్ ప్రకటించారు. 

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తాజా డేటాను చూస్తే.. అమెరికాలో మంకీపాక్స్ కేసులు 5,189కు పెరిగాయి. ప్రపంచంలో అత్యధిక కేసులు ఉన్న దేశంగా అమెరికా రికార్డులకు ఎక్కింది. ఇందులో 1,345 కేసులు న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ తర్వాత క్యాలిఫోర్నియా, ఇల్లినాయిస్ లో ఎక్కువ కేసులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు 22,000కు చేరాయి.
Monkeypox Virus
USA
cases
newyork
alarm

More Telugu News