nuts: చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే నట్స్!

healthy nuts that lower bad cholesterol levels

  • ఆక్రోట్, పిస్తా, బాదం, వేరుశనగ, జీడిపప్పులు
  • వీటిల్లో కొలెస్ట్రాల్ తగ్గించే ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం 
  • రోజుకు 20 గ్రాముల వరకు తీసుకుంటే మంచి ఫలితాలు

నట్స్ లో (కాయ గింజలు) పోషకాలు ఎక్కువ. రోజుకు కొద్ది పరిమాణంలో తీసుకున్నా ఆరోగ్య ప్రయోజనాలు అందుకోవచ్చు. గుండెకు చేటు చేసే కొలెస్ట్రాల్ ను నట్స్ తగ్గిస్తాయని ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. అందుకని కొలెస్ట్రాల్ సమస్యను ఎదుర్కొంటున్న వారు రోజూ నట్స్ తినడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఆరోగ్యవంతులు సైతం వీటిని మితంగా తీసుకోవడం వల్ల.. మరింత కాలం పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

రోజులో ఎంత తినాలి?
చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డీఎల్ ను తగ్గించే నట్స్ ను 20 గ్రాములు తీసుకోవాలి. అధిక ప్రొటీన్, పీచు వల్ల కడుపు నిండినట్టు భావన వస్తుంది. కేలరీలు కూడా ఎక్కువే. అందుకని వీటిని ఎక్కువ తీసుకుంటే బరువు పెరుగుతారు. కనుక ఎక్కువ తినకుండా, కనీస పరిమాణం వరకే తీసుకోవాలన్నది పోషకాహార వైద్యుల సూచన.

వాల్ నట్స్ (ఆక్రోట్)
వీటిల్లో ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ లభిస్తాయి. సాల్మోన, ట్యునా వంటి ఖరీదైన చేపల్లో దండిగా లభించే విలువైన మంచి ఫ్యాట్స్ ఇవి. గుండె స్పందనల్లో హెచ్చుతగ్గుల రిస్క్ ను ఈ ఫ్యాట్స్ తగ్గిస్తాయి. ట్రై గ్లిజరైడ్స్ ను సైతం తగ్గిస్తాయి. 

బాదం
బాదం గింజల్లో విటమిన్ ఈ అనే యాంటీ ఆక్సిడెంట్ తగినంత ఉంటుంది. హాని కారకాల వల్ల కణాలు దెబ్బతినకుండా ఇది రక్షణనిస్తుంది. జీవక్రియలు సజావుగా సాగేందుకు సాయపడుతుంది. 

పీనట్స్
వేరుశనగల్లో విటమిన్ బీ3, నయసిన్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. మంచి ప్రొటీన్, ఫైబర్ లభిస్తాయి. వీటిల్లో ఉండే ఫైటోస్టెరోల్స్, అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

పిస్తా పప్పులు
వీటిల్లోనూ ఫైటోస్టెరోల్స్ సమృద్ధిగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించే సహజసిద్ధమైన ఆహారం ఇది.

జీడి పప్పు 
జింక్, కాపర్, మెగ్నీషియం, సిలీనియం, విటమిన్ కే ఇందులో తగినంత లభిస్తాయి. ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే. 

ఎప్పుడు, ఎలా తినాలి..?
నట్స్ ను ఎప్పుడు, ఎలా తీసుకోవాలన్నది కూడా ముఖ్యమే. సలాడ్స్, పండ్లు, మిల్క్ షేక్ లతో కలిపి తీసుకోవచ్చు. కర్రీల్లో, గ్రేవీల్లో, వెగ్గీ సూప్ లలో కూడా కలుపుకుని తినొచ్చు. వీటినే సాల్ట్ వేసి రోస్ట్ చేసినవి తినకూడదు. దీనివల్ల శరీరంలోకి సోడియం ఎక్కువగా చేరుతుంది. రోస్ట్ చేయని వాటిని తీసుకుని, ఉప్పు లేకుండా సొంతంగా వేయించుకోవాలి. రాత్రివేళ నీటిలో నానవేసి మర్నాడు ఉదయం తీసుకోవడం కూడా మంచి విధానమే.

  • Loading...

More Telugu News