Earthquake: నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం

High Magnitude Earthquake Hits Nepal

  • ఉదయం 8.13 గంటల సమయంలో భూకంపం
  • కఠ్మాండుకు 147 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపం
  • భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం

నేపాల్‌ను భారీ భూకంపం ఒకటి వణికించింది. ఈ ఉదయం 8.13 గంటల సమయంలో రాజధాని కఠ్మాండుకు 147 కిలోమీటర్ల దూరంలో ఖోటాంగ్ జిల్లా మార్టింమ్ బిర్టా వద్ద 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ ఎర్త్‌కేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్  (NEMRC) తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్టు సమాచారం లేదు. 

నేపాల్‌లో ఇటీవల సంభవించిన భూకంపాలు తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. 25 ఏప్రిల్ 2015లో కఠ్మాండు, పోఖరా నగరాల్లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా పెను నష్టం వాటిల్లింది. దాదాపు 8,964 మంది మరణించగా, 22 వేల మందికిపైగా గాయపడ్డారు.

  • Loading...

More Telugu News