India: దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు, మరణాలు
- గత 24 గంటల్లో 19, 673 పాజిటివ్ కేసుల నమోదు
- వైరస్ తో తాజాగా 39 మంది మృతి
- ప్రస్తుతం దేశంలో 1,43,676 క్రియాశీల కేసులు
భారత్ లో గత 24 గంటల్లో కొత్తగా 19,673 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా వరుసగా 20 వేల కేసులు వస్తుండగా తాజాగా కాస్త తగ్గాయి. మరణాలు కూడా తగ్గాయి. మొన్న వైరస్ వల్ల 54 మంది మృతి చెందగా గత 24 గంటల్లో 39 మంది మృతి చెందారు.అదే సమయంలో 19,342 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 1,43,676 క్రియాశీల కేసులు ఉన్నాయి.
క్రియాశీల రేటు 0.33 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.48 శాతంగా నమోదైంది. కరోనా నుంచి దేశంలో ఇప్పటిదాకా 4,33,49,778 మంది కోలుకున్నారు. వైరస్ వల్ల ఇప్పటిదాకా 5,26,357 మంది మృతి చెందారు. మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది. మరోవైపు, దేశంలో ఇప్పటి వరకు 2,04,25,69,509 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 31,36,029 మందికి వ్యాక్సిన్ అందజేశారు.