cold water: చల్లటి నీరు తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచి చేయదు!

Health hazards of drinking cold water

  • జీర్ణ ప్రక్రియకు చల్లటి నీటితో అనర్థం
  • గుండె ఆరోగ్యంపైనా ప్రభావం
  • మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది
  • మైగ్రేన్ లక్షణాలు పెరుగుతాయి
  • శరీరంలో పోషకాల తగ్గుదలకు దారితీస్తుంది

కాలంతో సంబంధం లేకుండా మన చుట్టు ఉన్న వారిలో కొందరు చల్లటి నీరు తాగుతుంటారు. కూల్ వాటర్ తాగడం వారి దినచర్య లో భాగంగా ఉంటుంది. కొంత మందికి చల్లటి నీరు అస్సలు పడదు. జలుబు, దగ్గు తదితర అలెర్జీ,  ఆస్తమా, బ్రాంకైటిస్ కు దారితీస్తుందని దూరంగా ఉంటారు. కానీ, కొందరు తమకు ఏ సమస్య లేదన్నట్టు కూలింగ్ నీరే తీసుకుంటూ ఉంటారు. 

చల్లటి నీరు తాగితే ఏమవుతుంది? మహా అయితే గొంతు పట్టేస్తుంది? లేదా జలుబు చేస్తుంది? అంతే కదా అన్న ధోరణి కొందరిలో చూడొచ్చు. వేసవిలో దాహం తీరడం లేదని కొందరు ఇలా చల్లటి నీటిని ఆశ్రయిస్తుంటారు. కానీ, ఫ్రిడ్జ్ లో ఉంచిన నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అనర్థాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ అనర్థాలు..
  • చల్లటి నీరు తాగడం వల్ల మైగ్రేన్ తలనొప్పి లక్షణాలు కనిపిస్తాయి. మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న వారికి చల్లటి నీరుతో సమస్య మరింత పెరుగుతుంది. మైగ్రేన్ లేని వారికి సైతం ఈ తరహా లక్షణాలు కనిపిస్తాయి.
  • చల్లటి నీరు జీర్ణప్రక్రియ చురుకుదనాన్ని దెబ్బతీస్తుంది. దీంతో జీర్ణక్రియలు నిదానిస్తాయి. దీనివల్ల కడుపులో నొప్పి, విరేచనాలకు దారితీయవచ్చు.
  • చల్లటి నీరు తాగడం వల్ల పేగుల గోడలపైకి నూనెలాంటి జిడ్డు పదార్థం చేరుతుంది. ఇది అజీర్ణానికి కారణం అవుతుంది. 
  • రక్తం ద్వారా ఆక్సిజన్ ఎప్పటికప్పుడు మెదడుకు చేరవేస్తేనే.. మనం చురుగ్గా, శక్తివంతంగా ఉండగలం. కానీ, చల్లటి నీరు  మెదడుకు ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది. దీనివల్ల తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. మెదడు కణాలకు నష్టం కలుగుతుంది.
  • చల్లటి నీరుతో దాహం తీరదు కదా మరింత పెరుగుతుంది. కనుక మరింత నీరు తాగుతాం. దీనివల్ల మూత్ర విసర్జన కూడా ఎక్కువవుతుంది. దీనివల్ల శరీరం లవణాలను కోల్పోతుంది. 
  • చల్లటి నీరు తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్యాట్ చేరుకునేందుకు కారణమవుతుంది. 
  • చల్లటి నీరు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. భోజనం తర్వాత నీరు తీసుకోవడం వల్ల గుండె సమస్యలకు దారితీస్తుంది. 
  • చల్లటి నీరు వల్ల శరీరంలో పోషకాల స్థాయి తగ్గిపోతుంది. దీనివల్ల శరీరం పలు అనారోగ్యాలు, గాయాలపాలు కావడానికి కారణమవుతుంది.

  • Loading...

More Telugu News