Aamir Khan: ప్లీజ్!​ నా సినిమాను బహిష్కరించొద్దు: ఆమిర్​ ఖాన్​ విజ్ఞప్తి

Please dont boycott my Laal Singh Chaddha urges Aamir Khan
  • ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న ‘బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా’ హ్యాష్ ట్యాగ్
  • గతంలో దేశంపై ఆమిర్ చేసిన వ్యాఖ్యల్ని తెరపైకి తెచ్చిన నెటిజన్లు
  • దీనిపై స్పందించిన ఆమిర్.. సినిమా చూడాలంటూ విజ్ఞప్తి
ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ ఈ నెల 11వ తేదీన విడుదల కానుంది. హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్‌’కి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో ఆమిర్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. అక్కినేని నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం ప్రమోషన్లలో ఆమిర్ బిజీగా ఉన్నాడు. మరోవైపు దేశంపై గతంలో ఆమిర్ చేసిన వ్యాఖ్యలను తెరపైకి తెచ్చి ‘లాల్ సింగ్ చడ్డా’ను బహిష్కరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 

‘బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా’ అనే  హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. దీనిపై తాజాగా ఆమిర్  ఓ ఈవెంట్లో  స్పందించారు. తన సినిమాను బహిష్కరించవద్దని విజ్ఞప్తి చేశారు. ‘నా సినిమాలపై ఇలాంటి ప్రచారాలు జరగడం బాధాకరం. కొందరు నేను ఈ దేశాన్ని ఇష్టపడనని నమ్ముతున్నారు. అందుకు బాధ కలుగుతోంది. వాళ్ల మనసుకు అలా అనిపించి ఉండవచ్చు. కానీ అది అసత్యం. దయచేసి నా సినిమాని బహిష్కరించకండి. నా సినిమా చూడండి’ అని ఆమిర్ విజ్ఞప్తి చేశాడు. 

భారత్ లో అసహనం పెరుగుతోందని ఆమిర్ 2015లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నాడు ఆమిర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘మన దేశం చాలా సహనంతో ఉంటుంది. కానీ ఇక్కడ చెడును వ్యాప్తి చేసే వ్యక్తులు ఉన్నారు’ అని కామెంట్ చేశారు. ఆమిర్ మాజీ భార్య కిరణ్ రావు కూడా తమ పిల్లల భద్రత కోసం ఈ దేశం విడిచి వెళ్లే ఆలోచనతో ఉన్నామని చెప్పి వార్తల్లో నిలిచారు.
Aamir Khan
lal singh chaddah
movie
boycott
twitter

More Telugu News