iQOO 9T: అదిరే ఫీచర్లతో వచ్చేసిన ఐక్యూ 9టీ ఫోన్
- క్వాల్ కామ్ లేటెస్ట్ చిప్ సెట్ తో వచ్చిన తొలి ఫోన్
- రెండు వేరియంట్లలో విడుదల
- వీటి ధరలు రూ.49,999, రూ.54,999
- ఐసీఐసీఐ కార్డులపై రూ.4,000 తగ్గింపు
ఐక్యూ నుంచి ఫ్లాగ్ షిప్ ఫోన్ అయిన 9టీ నేడు భారత మార్కెట్లో విడుదలైంది. ఆగస్ట్ లో వచ్చిన తొలి ఫోన్ ఇదే. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 ర్యామ్ ఉంటుంది. క్వాల్ కామ్ ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ తో భారత మార్కెట్లోకి వచ్చిన తొలి ఫోన్ కూడా ఇదే. ఇందులో వీ1ప్లస్ అనే డిస్ ప్లే చిప్ కూడా ఉంటుంది. ఇది మంచి గేమింగ్ అనుభవాన్ని ఇస్తుందని.. నైట్ మోడ్ లో తీసుకునే ఫొటోల నాణ్యతను పెంచుతుందని కంపెనీ అంటోంది.
6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 120 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. అందులో 50 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సార్ కాగా, 13 మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ సెన్సార్, 12 మెగా పిక్సల్ పోర్ట్రయిట్ సెన్సార్. ఇక ముందు భాగంలో 16 మెగా పిక్సల్ కెమెరా ఉంటుంది.
ఆగస్ట్ 4న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ లో మొదటి విడత విక్రయాలు జరుగుతాయి. ఐక్యూ9 స్టోర్ నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చు. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ సామర్థ్యం కలిగిన వేరియంట్ ధర రూ.49,999. 12జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.54,999. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై రూ.4,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.