TDP: ప‌చ్చ‌గ‌డ్డి కోత‌ల్లో టీడీపీ ఎమ్మెల్యేలు... వీడియో ఇదిగో

tdp mlas cuts fodder and posts the video in social media
  • నిమ్మ‌ల‌కు తోడైన రామ‌రాజు
  • ఉండి ప‌రిధిలో ప‌చ్చ గ‌డ్డి కోతల్లో పాలుపంచుకున్న వైనం
  • వీడియోను పోస్ట్ చేసిన పాల‌కొల్లు ఎమ్మెల్యే
 ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు ఏది చేసినా ప్ర‌త్యేక‌మే. తాజాగా ఆయ‌న‌కు టీడీపీకే చెందిన‌ ఉండి ఎమ్మెల్యే వీవీ శివ‌రామ రాజు కూడా తోడ‌య్యారు. ఇద్ద‌రు ఎమ్మెల్యేలూ క‌లిసి ప‌శువుల‌కు గ్రాసం సేక‌ర‌ణ‌లో భాగంగా ప‌చ్చి గ‌డ్డి కోత‌ల్లో మునిగిపోయారు. త‌మ అనుచ‌రులు, స్థానిక రైతుల‌తో క‌లిసి ఇద్ద‌రు నేత‌లు హుషారుగా ప‌చ్చి గ‌డ్డి కోసి... గ‌డ్డి మోపుల‌ను నెత్తికెత్తుకుని మ‌రీ ముందుకు సాగారు.

ఇటీవ‌లి వ‌ర‌ద‌ల‌కు గోదావ‌రి ప‌రీవాహ ప్రాంతంలోని పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు గ్రామాలు నీట మునిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు నిత్యావ‌స‌రాలు పంపిణీ చేసిన నిమ్మ‌ల... ఆ త‌ర్వాత ఆయా గ్రామాల్లో ప‌శువుల‌కు గ్రాసం సేక‌ర‌ణ‌పై దృష్టి సారించారు. 

ఈ క్రమంలో ఉండి ప‌రిధిలో ప‌చ్చి గ‌డ్డి ఉంద‌ని తెలుసుకున్న ఆయ‌న.. పాల‌కొల్లు ముంపు ప్రాంతాల్లోని ప‌శువుల‌కు గ్రాసం అందజేయడంలో సహకరించాలని సహచర ఎమ్మెల్యే రామ‌రాజును కోరారు. నిమ్మ‌ల కోరిక మేర‌కు ట్రాక్ట‌ర్ల నిండా ప‌శుగ్రాసాన్ని రామ‌రాజు పాల‌కొల్లుకు పంపారు. తాజాగా ఇద్ద‌రు ఎమ్మెల్యేలు క‌లిసి ఉండి ప‌రిధిలో ప‌చ్చి గ‌డ్డి కోత‌ల్లో పాలుపంచుకున్నారు. ఈ వీడియోను రామానాయుడు త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
TDP
Palakollu
Undi
West Godavari District
East Godavari District
Nimmala Rama Naidu
V V Siva Ramaraju

More Telugu News