Dulquer Salmaan: రోజుకి 36 గంటలుంటే బాగుండేది: రష్మిక

Rashmika Interview
  • ఊపందుకున్న 'సీతా రామం' ప్రమోషన్స్ 
  • ఇంటర్వ్యూలు దంచేస్తున్న రష్మిక 
  • మిగతా  భాషల్లోను తానే డబ్బింగ్ చెబుతున్నానని వెల్లడి
  • దుల్కర్ తో జోడీకట్టాలని ఉందని చెప్పిన రష్మిక  
తెలుగు .. కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక, ఇతర భాషల్లోను కుదురుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. దుల్కర్ - మృణాల్ జంటగా నటించిన 'సీతా రామం' సినిమాలో రష్మిక ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఈ నెల 5వ తేదీన ఈ సినిమా వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ .. "నా సినిమాలలో నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకోవాలి. అప్పుడే నాకు సంతృప్తికరంగా అనిపిస్తుంది. అందువలన తమిళ .. మలయాళ భాషలు కూడా నేర్చుకుని డబ్బింగ్ చెబుతున్నాను. ఒక వైపున షూటింగులు .. మరో వైపున డబ్బింగులు .. భాషలు నేర్చుకునే క్లాసులు .. రోజుకు 36 గంటలుంటే బాగుండునని అనిపిస్తోంది. 

ఇక ఈ చిత్రంలో, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను .. నాకు తోచినట్టు చేస్తాను అనే టైపు పాత్రలో నేను కనిపిస్తాను. 1964 నాటి వాతావరణం కనిపించేలా షూట్ చేయడానికి చాలా కష్టపడ్డారు. రష్యా .. కశ్మీర్ వంటి ప్రదేశాల్లో విపరీతమైన చలిలో షూట్ చేశారు. ఈ సినిమాలో నేను దుల్కర్ కాంబినేషన్లో కనిపించను. ఆయనతో కలిసి నటించే ఛాన్స్ త్వరలో రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది.
Dulquer Salmaan
Mrunal
Rashmika Mandanna

More Telugu News