Boy: 30 సెకన్లలో రూ.35 లక్షల నగదు బ్యాగుతో చెక్కేసిన బాలుడు

Boy walks out with Rs 35 lakh from Patiala bank

  • పాటియాల ఎస్ బీఐ శాఖలో ఘటన
  • రద్దీ సమయంలో కౌంటర్ లోకి చొరబడిన బాలుడు
  • నగదు ఉంచిన బ్యాగుతో ఉడాయింపు
  • సీసీటీవీ కెమెరాల సాయంతో గుర్తించిన సిబ్బంది

బ్యాంకులో బాలుడు చోరీకి పాల్పడిన ఘటన పంజాబ్ లోని పాటియాలాలో చోటు చేసుకుంది. పట్టణంలోని కాళీదేవి ఆలయం సమీపంలోని ఉన్న ఎస్ బీఐ శాఖలో ఇది జరిగింది. ఏటీఎం మెషిన్ లో నింపడం కోసమని రూ.35 లక్షల నగదును ఒక బ్యాగులో పెట్టి ఉంచగా.. 10-12 ఏళ్ల బాలుడు ఆ బ్యాగ్ ను తీసుకెళ్లాడు. సీసీటీవీ కెమెరాల్లో ఇది రికార్డయింది. 

ఉదయం రద్దీ వేళల్లో 11.37 గంటల సమయంలో ఇది జరిగింది. దీంతో సిబ్బంది ఆలస్యంగా గుర్తించారు. ఓ బాలుడు బ్యాంకు శాఖలోకి మరో వ్యక్తితో కలసి ప్రవేశించాడు. బ్యాంకులోనే 20 నిమిషాల పాటు అంతా పరిశీలించారు. ఆ తర్వాత నగదు బ్యాగు ఉంచిన ఐదో నంబర్ కౌంటర్ దగ్గరకు బాలుడు వెళ్లి 30 సెకన్లలోపే, దాన్ని తీసుకుని బయటకు వచ్చేశాడు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్టు ఎస్పీ వజీర్ సింగ్ తెలిపారు. ఈ వ్యవహారం వెనుక బ్యాంకు సిబ్బంది సహకారం ఉండొచ్చన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

  • Loading...

More Telugu News