command control centre: పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

cm kcr inauguration command control  centre

  • 18 అంతస్తుల్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్
  • రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లు, సీసీ కెమెరాల అనుసంధానం
  • ఏడో అంతస్తులో సీఎం, సీఎస్, డీజీపీలకు చాంబర్లు

హైదరాబాద్ లో ఎంతో అత్యాధునికంగా నిఘా సామర్థ్యాలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. దీనికి హోంమంత్రి మహమూద్ అలీతోపాటు, సీఎస్ సోమేశ్ కుమార్, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ 18 అంతస్తులతో ఉంటుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ నగరంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు స్టేషన్లతో ప్రత్యక్ష అనుసంధానం ఉంటుంది. సీసీటీవీ కెమెరాలతో రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవచ్చు. ఏడు ఎకరాల పరిధిలో రూ.600 కోట్లతో ఈ నిర్మాణం చేశారు. చివరిదైన 18వ అంతస్తులో సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయం ఉంటుంది. ఏడో అంతస్తులో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులకు చాంబర్లు ఏర్పాటు చేశారు. 

అవసరమైతే ముఖ్య సమీక్షలను ఇక్కడి నుంచే చేయడానికి సకల సదుపాయాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించారు. నగరం పరిధిలో అన్ని పోలీసు విభాగాలను ఇక్కడకు తీసుకొచ్చి ఏకీకృత కేంద్రంగా దీన్ని మలిచారు.

  • Loading...

More Telugu News