Rajasekhar: యంగ్ డైరెక్టర్ తో రాజశేఖర్ మూవీ?

Rajasekhar in Pavan Sadineni movie
  • 'గరుడ వేగ' తో హిట్ కొట్టిన రాజశేఖర్
  • కలిసిరాని  'కల్కి' .. 'శేఖర్' సినిమాలు
  • పవన్ సాధినేనికి ఓకే చెప్పిన రాజశేఖర్ 
  • నిర్మాతగా మార్కాపురం శివకుమార్  
వరుస ఫ్లాపులతో ఉన్న రాజశేఖర్ ని 'గరుడ వేగ' గట్టెక్కించింది. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించి .. రాజశేఖర్ లో కొత్త ఉత్సాహాన్నీ నింపింది. తనని ఆదుకునేది పోలీస్ పాత్రలేనని భావించిన రాజశేఖర్, ఆ తరువాత 'కల్కి' .. 'శేఖర్' అనే రెండు సినిమాలు చేశారు. ఈ రెండు కూడా పోలీస్ నేపథ్యంలో నడిచే కథలే. 

గతంలో రాజశేఖర్ బర్త్ డే రోజున మూడు ప్రాజెక్టులను ఎనౌన్స్ చేశారు. వాటిలో ఒక్క 'శేఖర్' మాత్రమే థియేటర్లకు వచ్చింది. మిగతా రెండు ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు. వాటికి సంబంధించిన హడావిడి ఎక్కడా కనిపించడం లేదు .. వినిపించడం లేదు. రాజశేఖర్ నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది. 

ఈ నేపథ్యంలో ఆయన పవన్ సాధినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది. పవన్ సాధినేని నుంచి ఇంతకుముందు 'ప్రేమ ఇష్క్ కాదల్' .. 'సావిత్రి' అనే సినిమాలు వచ్చాయిగానీ, ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. రాజశేఖర్ తో ఆయన చేయనున్న సినిమాకి, మార్కాపురం శివకుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం.
Rajasekhar
Pavan Sadhineni
Tollywood

More Telugu News