China: నాన్సి ఫెలోసీపై ఆంక్షలు విధించిన చైనా
- ఇటీవలే తైవాల్లో పర్యటించిన ఫెలోసీ
- ఫెలోసీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించిన చైనా
- ఫెలోసీ సహా ఆమె కుటుంబ సభ్యులపైనా చైనా ఆంక్షలు
తైవాన్లో పర్యటించిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సి ఫెలోసిపై చైనా ఆంక్షలు విధించింది. ఈ మేరకు శుక్రవారం చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఫెలోసీపై ఏ తరహా ఆంక్షలు విధిస్తున్న విషయాన్ని చైనా వెల్లడించలేదు. ఫెలోసీ తైవాన్ పర్యటనకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన చైనా ఈ పర్యటన పట్ల నిరసనను తెలిపింది.
గడచిన 25 ఏళ్లలో తైవాన్ను సందర్శించిన అమెరికా అతిపెద్ద నేత ఫెలోసీనే. తైవాన్ను తన అంతర్భాగంగా చైనా పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తైవాన్లో ఫెలోసీ పర్యటనను తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే కవ్వింపు చర్యగానే చైనా చెబుతోంది. ఈ క్రమంలో ఫెలోసీపైనే కాకుండా ఆమె కుటుంబ సభ్యుల పైనా ఆంక్షలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది.