Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన ప్రధాని మోదీ... క్యూ కట్టిన ఎలక్ట్రోరల్ సభ్యులు
- ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్
- తొలి గంటలోనే ఓటేసిన ప్రధాని మోదీ
- సాయంత్రం 5 గంటల దాకా కొనసాగనున్న పోలింగ్
- పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభం
- ఈ రాత్రికే ఫలితం వెలువడనున్న వైనం
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా కీలక ఘట్టమైన పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. శనివారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల దాకా కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల(రాజ్యసభ, లోక్ సభ) సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉపరాష్ట్రపతి పదవి కోసం అధికార ఎన్డీఏ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్కడ్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి ఎన్నికల ఎలక్ట్రోరల్ సభ్యులు క్యూ కట్టారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ రాత్రికే ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితం వెలువడనుంది. ఇప్పటిదాకా ఉన్న అంచనాల ప్రకారం ఈ ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్థి ధన్కడే విజయం సాధించే అవకాశాలున్నాయి.