Smriti Mandhana: కామన్వెల్త్ క్రీడల క్రికెట్ సెమీస్ లో టీమిండియా, ఇంగ్లండ్ ఢీ... స్మృతి మంధన వీరవిహారం
- ఎడ్జ్ బాస్టన్ మైదానంలో మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- 32 బంతుల్లోనే 61 పరుగులు చేసిన స్మృతి మంధన
- 9 ఓవర్లలో 2 వికెట్లకు 77 పరుగులు చేసిన టీమిండియా
కామన్వెల్త్ క్రీడల క్రికెట్ లో నేడు తొలి సెమీఫైనల్ జరుగుతోంది. బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరుగుతున్న ఈ నాకౌట్ మ్యాచ్ లో టీమిండియా, ఇంగ్లండ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
కెప్టెన్ నిర్ణయం సరైనదే అని నిరూపిస్తూ డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధన చిచ్చరపిడుగులా విరుచుకుపడింది. కేవలం 32 బంతుల్లోనే 61 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించింది. స్మృతి మంధన స్కోరులో 8 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. స్మృతి మంధన నటాలీ సివర్ బౌలింగ్ లో అవుటైంది. అంతకుముందు, మరో ఓపెనర్ షెఫాలీ వర్మ 15 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగింది.
ప్రస్తుతం టీమిండియా స్కోరు 9 ఓవర్లలో 2 వికెట్లకు 77 పరుగులు. క్రీజులో జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఉన్నారు.