Nithya Menen: ఆ విష‌యాలు తెలిస్తే నిత్యా మీన‌న్‌తో ప్రేమ‌లో ప‌డే వాడిని కాదంటున్న సంతోష్ వ‌ర్కీ

I wont have loved her if I had known this says Santhosh Varkey about Nithya Menon
  • ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ ప్ర‌చారం చేసిన సంతోష్‌
  • వ‌ర్కీ కొన్నేళ్లుగా త‌న‌ను వేధిస్తున్నాడ‌ని చెప్పిన నిత్యా మీన‌న్‌
  • పోలీసు కేసు పెట్ట‌కుండా క్ష‌మించి వ‌దిలేశాన‌న్న న‌టి
అందంతో కాకుండా అభిన‌యంతో ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి పేరు తెచ్చుకున్న న‌టి నిత్యామీన‌న్‌. సిద్ధార్థ్ నటించిన 180 చిత్రం తమిళంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ధనుష్‌తో కలిసి అతని రాబోయే చిత్రం 'తిరుచిత్రంబలం'లో నటిస్తోంది. కాగా, మోహన్‌లాల్ 'ఆరట్టు' సినిమాపై స్పందించి వైరల్‌గా మారిన వ్యక్తి సంతోష్ వర్కీ  కొన్నేళ్లుగా తాను నిత్యా మీనన్‌ను ఇష్టపడుతున్నానని, ఆమెను వివాహం చేసుకోబోతున్నానని చెప్పి వార్త‌ల్లో నిలిచాడు. ఈ విష‌యంపై నిత్యా ఈ మ‌ధ్య స్పందించింది. సంతోష్ వర్కీ మాటలు వినే వారు మూర్ఖులు అని చెప్పింది. సంతోష్ వర్కీ తనను పెళ్లి చేసుకోవాలని కొన్నాళ్లుగా వేధిస్తున్నాడ‌ని, 30కి పైగా మొబైల్ నంబర్ల నుంచి కాల్ చేస్తూ చికాకు పెడుతున్నాడని తెలిపింది. అయిన‌ప్ప‌టికీ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌కుండా అత‌డిని క్షమించానని చెప్పింది. 

నిత్యా మీనన్ చేసిన ఆరోపణలపై సంతోష్ వర్కీ స్పందించాడు. 30కి పైగా నంబర్ల నుంచి కాల్ చేసి చిత్రహింసలకు గురిచేశానని నిత్య చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నాడు. ఒక్క వ్యక్తి తన పేరు మీద ఎన్ని సిమ్‌కార్డులు కొంటాడో జనాలు ఊహించుకో వాల‌న్నాడు. నిత్యా మీనన్‌కు వేరే వ్యక్తితో నిశ్చితార్థం అయింద‌ని ఆమె త‌ల్లి చెబితే.. జ‌ర‌గ‌లేద‌ని ఆమె తండ్రి త‌న‌కు చెప్పార‌న్నాడు. దాంతో, తాను చాలా కంగారు ప‌డ్డాన‌ని తెలిపాడు. వాళ్లు త‌న‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టబోతున్నారని తెలిసింద‌న్నాడు.  నిత్యా గురించి ఈ విషయాలు తెలిసి ఉంటే నేను ఆమెతో ప్రేమలో పడి త‌న‌ చుట్టూ తిరిగేవాడిని కాదన్నాడు. త‌న తండ్రి చనిపోయిన తర్వాత ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకుండా.. త‌న ప‌ని తాను చేసుకుంటున్నాన‌ని తెలిపాడు.
Nithya Menen
Tollywood
Kollywood
Santhosh Varkey
marriege roumers

More Telugu News